విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో విషాదం
close

తాజా వార్తలు

Updated : 26/04/2021 07:57 IST

విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో విషాదం

ఆక్సిజన్‌ అందక ఇద్దరు కొవిడ్‌ రోగులు మృతి
పలువురి పరిస్థితి విషమం

విజయనగరం: విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఇద్దరు కొవిడ్‌ రోగులు మృతిచెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మహారాజా ఆస్పత్రిని సందర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ప్రైవేటు అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అందిస్తుండగా.. మరికొందరిని వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని