మద్యం మత్తులో పాత్రికేయులపై దాడి
close

తాజా వార్తలు

Published : 17/07/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మద్యం మత్తులో పాత్రికేయులపై దాడి

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో వీధి రౌడీలు వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న పాత్రికేయులతో అకారణంగా గొడవకు దిగడంతో పాటు మద్యం సీసాలతో తలపై కొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్ ఓ పత్రికలో విలేకరిగా, ఆయన సోదరుడు దిలీప్ అదే పత్రికలో సబ్ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం నందినగర్ గ్రౌండ్స్ ఖాళీ స్థలంలో కొంతమంది రౌడీలు తిష్టవేసి మద్యం తాగుతూ రోడ్డుపై వచ్చిపోయేవారిని అడ్డుకుంటూ దుర్భాషలాడుతున్నారు. అదే సమయంలో ఇంటి వద్ద నుంచి ఆఫీస్ వైపు వెళ్తున్న అరుణ్, దిలీప్‌తో వారు గొడవకు దిగడంతో పాటు చేతికందిన మద్యం సీసాలతో చితకబాదారు. విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దిలీప్ తలకు, అరుణ్ ఛాతికి బలమైన గాయాలయ్యాయి. దీంతో వారిద్దరూ అక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం స్థానికులు అక్కడికి రాగానే దుండగులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వ్యక్తులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రాంతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఒంటరిగా వెళ్లే వారిపై రౌడీలు దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని స్థానికులు తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని