కర్నూలు అరికెర రథోత్సవంలో అపశ్రుతి

తాజా వార్తలు

Published : 13/03/2021 01:09 IST

కర్నూలు అరికెర రథోత్సవంలో అపశ్రుతి

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు

ఆలూరు గ్రామీణం: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. కనులవిందుగా జరుగుతున్న పాండురంగ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకొని ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రిని పురస్కరించుకుని గ్రామంలో కొలువైన పాండురంగ స్వామికి శుక్రవారం రథోత్సం నిర్వహించారు. ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని రథాన్ని లాగుతుండగా పైనున్న హై-టెన్షన్‌ తీగల ఎర్తింగ్‌ తగిలి పలువురికి విద్యుత్‌ షాక్‌ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే స్ఫృహ కోల్పోవడంతో వారిని వెంటనే అలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతిచెందిన వారిని శివ (25), లక్ష్మన్న (28)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారికి అలూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం: మంత్రి జయరాం
ఆలూరు ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్నట్లు మంత్రి జయరాం వెల్లడించారు. ఆలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందించారు. వైఎస్‌ఆర్ బీమా పథకం త్వరగా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని