కశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల హతం!
close

తాజా వార్తలు

Published : 21/10/2020 01:23 IST

కశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల హతం!

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని హక్రిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సీఆర్పీఎఫ్‌, ఆర్మీ దళాలకు సమాచారం అందడంతో ప్రత్యేక ఆపరేషన్‌ బృందాన్ని మంగళవారం రంగంలోకి దింపాయి. ఆపరేషన్‌లో భాగంగా వారు ఉగ్రవాదులు ఉన్న హక్రిపొరా గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో ఉగ్రమూకలు భద్రతాదళాలపైకి కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే సైనికులు అప్రమత్తమై ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కాగా హతమైన ఉగ్రవాదుల గుర్తింపును అధికారులు నిర్ధరించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం కూడా షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని