kidnap: ఎస్‌ఆర్‌నగర్‌లో వృద్ధుల కిడ్నాప్‌ కలకలం

తాజా వార్తలు

Published : 24/09/2021 01:27 IST

kidnap: ఎస్‌ఆర్‌నగర్‌లో వృద్ధుల కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌: నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఇద్దరు వృద్ధురాళ్లను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. వృద్ధుల కేకలు విన్న స్థానికులు అమీన్‌పూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం అమీన్‌పూర్‌ పోలీసులు ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఎఫ్‌ఐఆర్‌ను బదిలీ చేశారు. కీలకమైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని ఎత్తుకెళ్లారని బాధితులు పేర్కొన్నారు. న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మిరాజ్‌ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల పేరు మీద అమీర్‌పేటలోని లీలానగర్‌లో ఉన్న కోట్ల ఆస్తి కోసమే కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని