AP News: మామ‌, మేన‌ల్లుడి ఆక‌స్మిక మృతి

తాజా వార్తలు

Updated : 03/06/2021 10:52 IST

AP News: మామ‌, మేన‌ల్లుడి ఆక‌స్మిక మృతి

ఆదోని: క‌ర్నూలు జిల్లా ఆదోనిలో ఓ కుటుంబానికి చెందిన మామ, మేన‌ల్లుడి ఆక‌స్మిక మృతి స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. పట్టణంలోని తిక్కస్వామి దర్గా వెనుకభాగంలో నివాసం ఉండే గిరి(35), మహేశ్‌(13) బుధవారం అర్ధరాత్రి సమయంలో వాంతులు చేసుకొని అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కుటుంబ స‌భ్యులు వీరిని ఆదోని ప్రాంతీయ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ వీరిద్ద‌రూ ఈ తెల్ల‌వారుజామున మృతిచెందారు. గిరి ఎల‌క్ట్రీషియ‌న్‌గా ప‌ని చేస్తూ జీవనం గ‌డిపేవారు. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు వీరి ఆక‌స్మిక మృతికి గ‌ల కార‌ణాలపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని