Crime News: బెంగాల్‌లో ఇద్దరు పంజాబ్‌ స్మగ్లర్లు హతం
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 05:38 IST

Crime News: బెంగాల్‌లో ఇద్దరు పంజాబ్‌ స్మగ్లర్లు హతం

చండీగఢ్‌: లుధియాలో ఇటీవల ఇద్దరు పోలీసు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లపై కాల్పులు జరిపి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్‌కు చెందిన ఇద్దరు మాదకద్రవ్యాల స్మగ్లర్లు పశ్చిమ బెంగాల్‌ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరయ్యారు. కోల్‌కతా శివార్లలోని ఓ నివాస సముదాయం వద్ద జైపాల్‌ సింగ్‌ భుల్లర్‌, జస్ప్రిత్‌ సింగ్‌లను బెంగాల్‌ పోలీసులు కాల్చి చంపారు. ఈ విషయాన్ని పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా ధ్రువీకరించారు.  

పశ్చిమ బెంగాల్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌ వీకే గోయల్‌ మాట్లాడుతూ.. ‘‘పలువురు నేరస్థులు కోల్‌కతా సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దాగి ఉన్నారన్న సమాచారం మాకు వచ్చింది. దీంతో నేరస్థులను పట్టుకునేందుకు అక్కడికి వెళ్లగా పలు కేసుల్లో నిందితులుగా ఉన్న జస్ప్రీత్‌, జైపాల్‌ను గుర్తించాము. అయితే వారిని అరెస్టు చేయాలని ప్రయత్నించినప్పటికీ  వారు మాపై కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా మీము ఎదురుకాల్పులు జరపడంతో వారు మరణించారు’’ అని ఆయన తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు గాయలైనట్లు తెలిపారు. ఈ ఘటనలో రూ.7 లక్షల నగదు, 5 ఆయుధాలు, 89 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఎన్‌కౌంటర్‌ అనంతరం పంజాబ్‌ డీజీపీ గుప్తా మాట్లాడుతూ.. జైపాల్‌ భుల్లర్‌, జస్ప్రీత్‌ సింగ్‌ పేరు మోసిన డ్రగ్‌ స్మగ్లర్లని, వారిపై తలా రూ.10 లక్షలు, రూ.5 లక్షల రివార్డు ఉందని తెలిపారు. జైపాల్‌పై 25 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గత నెల 15న లుధియానాలోని జగ్రాన్‌లో హత్యకు గురైన పోలీసు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు భగవాన్ సింగ్‌, దల్విందర్‌జిత్ సింగ్‌ కేసులో వీరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు, అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నరంటూ సమాచారం రావడంతో మే 15న లుధియానాలో పోలీసులు తనీఖీలు చేపట్టారు. ఈక్రమంలో పలువురు దుండగలు పోలీసులపై కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీస్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు మరణించారు. దీంతో పోలీసులు జైపాల్, జస్ప్రీత్‌తోపాటు పలువురిపై కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జైపాల్‌ సహచరుడు భరత్‌ కుమార్‌ను అరెస్టు చేసి విచారించడంతో జైపాల్‌ ఎక్కడున్నాడన్న విషయాన్ని చెప్పినట్లు పంజాబ్‌ డీజీపీ తెలిపారు. దీంతో ప్రత్యేక బృందాలను కోల్‌కతా పంపి అక్కడి పోలీసుల సహకారంతో వారిని పట్టుకొచ్చేందుకు వెళ్లినట్లు తెలిపారు.  
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని