బెజవాడలో పట్టపగలు దారుణహత్య
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 17:04 IST

బెజవాడలో పట్టపగలు దారుణహత్య

విజయవాడ: బెజవాడలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. విజయవాడ దుర్గ అగ్రహారంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కండ్రిగకు చెందిన రామారావుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీం వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆర్థిక విభేదాలా, వివాహేతర సంబంధమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని