ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద వ్యక్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

తాజా వార్తలు

Updated : 08/06/2021 16:30 IST

ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద వ్యక్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

హైద‌రాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌కలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి య‌త్నించ‌గా అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అత‌డిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

హైదరాబాద్‌లోని కోంప‌ల్లికి  చెందిన అన్నాద‌మ్ములు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వద్ద మంత్రుల వాహ‌న‌శ్రేణికి అడ్డుగా వెళ్లి ఆందోళ‌న చేశారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఇంటి వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన త‌న‌నే పోలీసులు వేధిస్తున్నార‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన వ్య‌క్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని