Uthra murder case: పాముతో భార్యను చంపించిన భర్తకు రెండు జీవితఖైదుల శిక్ష..

తాజా వార్తలు

Updated : 13/10/2021 16:23 IST

Uthra murder case: పాముతో భార్యను చంపించిన భర్తకు రెండు జీవితఖైదుల శిక్ష..

కొల్లం: రెండో పెళ్లికి అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను పాముకాటుతో చంపించిన భర్తకు కేరళలోని ఓ సెషన్స్‌ కోర్టు రెండు జీవితఖైదుల శిక్ష విధించింది. ఈ కేసులో భర్త సూరజ్‌ను దోషి అని గత సోమవారం తేల్చిన న్యాయస్థానం.. నేడు శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది అత్యంత అరుదైన కేసు. ఈ నేరానికి గానూ దోషికి మరణశిక్ష విధించాలి. కానీ, అతడి వయసు(28ఏళ్లు)ను దృష్టిలో పెట్టుకుని జీవితఖైదు విధిస్తున్నాం’’ అని న్యాయమూర్తి వెల్లడించారు. 

దీంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసినందుకు మరో 5ఏళ్లు, గతంలో ఒకసారి హత్యాయత్నం చేసినందుకు 10ఏళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ 17ఏళ్ల జైలుశిక్ష పూర్తయిన తర్వాతే రెండు జీవిత ఖైదుల శిక్ష మొదలవుతుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ శిక్షలతో పాటు రూ.5.85లక్షల జరిమానా కూడా విధించింది.  

కేసు వివరాలివి..

కేరళలోని కొల్లం జిల్లా అంచల్‌ ప్రాంతానికి చెందిన ఉత్రాకు అదే ప్రాంతానికి చెందిన సూరజ్‌ కుమార్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న సూరజ్‌.. తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ఉత్రా అడ్డుగా ఉండటంతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఇందుకోసం గతేడాది మే నెలలో స్థానికంగా పాములు పట్టే వ్యక్తికి డబ్బులు ఇచ్చి నాగుపామును తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని నిద్రిస్తున్న ఉత్రాపైకి వదిలాడు. పాము రెండుసార్లు కాటు వేయడంతో ఆమె నిద్రలోనే మరణించింది. 

అయితే గతంలో కూడా ఉత్రా ఓసారి పాము కాటుకు గురికావడంతో ఆమె మృతిపై అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని