దంపతుల హత్యకేసు: మరొకరి అరెస్ట్‌
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 13:39 IST

దంపతుల హత్యకేసు: మరొకరి అరెస్ట్‌

మంథని: న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసులో ఏ-5గా ఉన్న లచ్చయ్యను అరెస్ట్‌ చేసి మంథని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. లచ్చయ్యకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు అతడిని కరీంనగర్‌ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో కుంట శ్రీను, కుమార్, చిరంజీవి, బిట్టు శ్రీనులను పోలీసులు అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకోగా.. తాజాగా ఐదో నిందితుడు లచ్చయ్యను అరెస్ట్‌ చేశారు. 

మరోవైపు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. మంథని మేజిస్ట్రేట్‌ ముందు 9 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. సాక్షుల్లో వామన్‌రావు తండ్రి, హత్య జరిగిన స్థలంలోని బస్సులోని డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని