గోడ కూలి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

తాజా వార్తలు

Published : 09/07/2021 01:22 IST

గోడ కూలి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

సనత్‌నగర్: వాకింగ్ కోసం వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి గోడ కూలి మీద పడటంతో మృతి చెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్ నగర్‌కు చెందిన ఆశిష్ బుధవారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. చీకటి పడుతున్నప్పటికీ ఆశిష్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో వెంటనే వెళ్లి ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రాజీవ్ నగర్ ప్రాంతంలో గోడ కూలడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా ఆశిష్‌ మృతదేహం బయటపడింది. వాకింగ్ చేస్తూ గోడ పక్కగా వెళుతుండగా అతనిపై పడటంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని