TS News: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

తాజా వార్తలు

Updated : 03/07/2021 10:44 IST

TS News: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

మంచిర్యాల నేరవార్తలు: మనస్పర్థల కారణంగా భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానికంగా ఉన్న సాయికుంట కాలనీలో నాగరాజు(39), స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన భార్య స్వరూప నిద్రిస్తున్న భర్తను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసింది. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని