సుపారీ ఇచ్చి.. సజీవదహనం చేయించి..

తాజా వార్తలు

Published : 16/02/2021 01:32 IST

సుపారీ ఇచ్చి.. సజీవదహనం చేయించి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువుహత్య

గోరఖ్‌పూర్: ఇతర మతస్థుడిని ప్రేమించిందన్న కారణంతో సొంత కుమార్తెను సజీవదహనం చేయించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. యువతి కుటుంబీకులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. బెల్‌ఘట్‌ ప్రాంతానికి చెందిన రంజనా యాదవ్‌ వేరే మతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీనికి ఆమె తండ్రి కైలాశ్‌ యాదవ్‌ ఒప్పుకోలేదు. ఆ యువకుడితో మాట్లాడొద్దని చెప్పినా రంజన వినిపించుకోలేదు. దీంతో ఆమెను చంపేందుకు రూ.1.5లక్షల సుపారీ ఇచ్చి ఓ కాంట్రాక్టు కిల్లర్‌ను నియమించారు. ఫిబ్రవరి 3న పథకం ప్రకారం రంజనను ఆమె తండ్రి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత యువతి అన్నయ్య అజిత్‌ యాదవ్‌, బావ సత్యప్రకాశ్‌ యాదవ్‌ సహాయంతో ఆ యువతి కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం కిల్లర్‌ ఆమెపై పెట్రోలు పోసి కాల్చేశాడు.

ఫిబ్రవరి 4వ తేదీన ధంగట పోలీసుస్టేషన్‌ పరిధిలో సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కైలాశ్‌యాదవ్‌ తన నేరాన్ని ఒప్పుకున్నారు. ఆయనకు సహకరించిన కుమారుడు, అల్లుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాంట్రాక్టు కిల్లర్‌ వరుణ్‌ తివారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని