ప్రేమ పెళ్లా..? వలపు వలా..?

తాజా వార్తలు

Updated : 19/05/2021 10:42 IST

ప్రేమ పెళ్లా..? వలపు వలా..?

వివాదాస్పదమైన మహిళా కానిస్టేబుల్‌ పెళ్లి వ్యవహారం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ పెళ్లి వ్యవహారం వివాదాస్పదమయ్యింది.. ఆమె తనపై వలపువల విసిరి మోసం చేసిందంటూ భర్త సెల్ఫీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో కలకలం రేగింది. తన భర్త ఉద్దేశపూర్వకంగానే వదిలేసి వెళ్లాడంటూ ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తతోపాటు అతని తండ్రిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

భర్త ఆత్మహత్య.. రెండో వివాహం..

నగరంలోని రహమత్‌నగర్‌లో ఉంటున్న మహిళకు ఏడేళ్ల క్రితం పోలీస్‌ ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో పెళ్లయ్యింది. రెండేళ్లకే అతను ఆత్మహత్య చేసుకోవడంతో తన కుమార్తెతో కలిసి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం సిద్ధమవుతోంది. మూడున్నరేళ్ల క్రితం కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడు (24) హైదరాబాద్‌కు వచ్చి సదరు మహిళ ఇంటి పక్కనే అద్దెకుండే వాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఆమె గతేడాది కానిస్టేబుల్‌(ఎ.ఆర్‌)గా ఎంపికయ్యింది. అనంతరం గతేడాది నవంబరులో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తనకు ఏడేళ్ల కుమార్తె ఉందని, భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయాలు తెలిసే తాను పెళ్లికి అంగీకరిస్తున్నట్లు అతని నుంచి ఒప్పంద పత్రం రాయించుకుంది.

అభిప్రాయభేదాలు..

 పెళ్లైన కొద్ది రోజులకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.నాలుగురోజుల క్రితం భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తనను వదిలేసి వెళ్లాడంటూ ఆమె ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కానిస్టేబుల్‌కు గతంలోనే మూడు వివాహాలయ్యాయని, ఈ విషయాన్ని దాచిపెట్టిందని, తనపై వలపువల విసిరిందంటూ ఆరోపిస్తూ ఆమె భర్త సెల్ఫీ వీడియోలు, పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. శంషాబాద్‌ డీసీపీ, షాబాద్‌ ఠాణాకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు వీడియోలను, ఫొటోలను పంపాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని