భర్త కళ్లెదుటే మహిళపై సామూహిక అత్యాచారం! 

తాజా వార్తలు

Published : 01/04/2021 01:15 IST

భర్త కళ్లెదుటే మహిళపై సామూహిక అత్యాచారం! 

ఆగ్రాలో దారుణం

ఆగ్రా: యూపీలో ఓ మహిళపై దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను ముగ్గురు దుండగులు అడ్డగించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ఆగ్రా జిల్లా ఎత్మద్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ అమానవీయ ఘటనపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో మహిళ తన భర్తతో కలిసి ఎత్మదుల్లా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు వారిని మార్గం మధ్యలో అడ్డగించారు. వారిపై దాడిచేసి సమీపంలోని అటవీప్రాంతానికి లాక్కెళ్లారు. అనంతరం భర్త కళ్లెదుటే మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించడమే కాకుండా తమ నుంచి రూ.10వేల నగదు, చెవిపోగులు, ఇతర వస్తువులు లాక్కెళ్లారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్టు ఎస్పీ సత్యజిత్‌ గుప్తా వెల్లడించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన అనంతరం నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని