పెళ్లయిన రెండో రోజే  ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 29/05/2021 13:23 IST

పెళ్లయిన రెండో రోజే  ఆత్మహత్య


వివాహ దుస్తుల్లో అనూష

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: కాళ్ల పారాణి ఆరనే లేదు. తోరణాలు వాడనే లేదు.. ఏమైందో తెలియదు కానీ నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం మర్రిబావితండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మర్రిబావితండాకు చెందిన పుల్య-సాలి దంపతుల రెండో కూతురు సబావట్‌ అనూష(21)కి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దవూరతండాకు చెందిన వరుడితో ఈ నెల 26న వధువు ఇంటి వద్ద వివాహం జరిగింది. 27న వరుడి ఇంట్లో వివాహ విందు నిర్వహించారు. అదే రోజు అర్ధరాత్రి కొత్త జంట మర్రిబావితండాకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం కొత్త పెళ్లికూతురు ఇంట్లో ఓ గదిలోకి వెళ్లింది. పెళ్లి అలసటతో నిద్రిస్తుందేమోనని అందరూ భావించారు. సాయంత్రం పిలిచినా తలుపులు తెరవక పోవడంతో వాటిని ధ్వంసం చేసి చూసే సరికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించింది. వివాహం జరిగి రెండు రోజులు గడవకముందే పెళ్లి కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్‌రావు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి కారణాలను ఆరా తీస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని