మాయ‘లేడీ’ మోసం

తాజా వార్తలు

Updated : 21/03/2021 12:09 IST

మాయ‘లేడీ’ మోసం

ఏర్పేడు: ఒకటికి నాలుగు రెట్లు డబ్బులు ఇస్తామంటూ అందంగా మోసగించిన మాయలేడీని చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన ధనలక్ష్మి(35) అలియాస్‌ అనూష అనంతపురానికి చెందిన సూర్యతో కలిసి అమాయకులకు వల వేసింది. రూ.12లక్షల నగదు ఇస్తే నాలుగు రెట్లు ఇస్తామంటూ వేసిన గాలానికి కడపకు చెందిన సుధాకర్‌ చిక్కాడు. ఆశకుపోయి డబ్బు ఇచ్చాడు.

ముందుగా చెప్పినట్టే రెండ్రోజుల క్రితం సుధాకర్‌కు అనూష, సూర్యా ఏర్పేడు సమీపంలో రెండు బ్యాగులు అందజేశారు. బ్యాగ్‌లు బరువుగానే ఉన్నాయంటూ సంబరపడిన సుధాకర్‌కు ఇంటికి వెళ్లి తెరిచి చూశాక కాసేపు నోట మాట రాలేదు. బ్యాగ్‌లో పైన రూ.100 నోట్ల  కట్టలు పేర్చిన అనూష ముఠా కింద భాగంలో కాగితాలు పెట్టి మోసం చేసింది. మోసం నుంచి తేరుకున్న సుధాకర్‌  ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనూషను అరెస్టు చేసి రూ.9లక్షలు రికవరీ చేశారు. సహ నిందితుల కోసం గాలిస్తున్నారు.

 


 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని