తణుకు వైకాపా సమావేశంలో అపశ్రుతి

తాజా వార్తలు

Updated : 10/09/2021 22:10 IST

తణుకు వైకాపా సమావేశంలో అపశ్రుతి

కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి

ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జరిగిన వైకాపా సమావేశంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో కొబ్బరి చెట్టు కూలడంతో అక్కడే ఇద్దరు మహిళలు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున మండలంలోని రేలంగి గ్రామంలో జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. పట్టాల పంపిణీ కోసం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో మహిళలు కూర్చున్న చోట ప్రమాదవశాత్తు కొబ్బరిచెట్టు కూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కాసాని దుర్గా భవాని(30), శాంతకుమారి(35) అనే ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని