హంతకుడిని పట్టించిన అక్షర దోషాలు!

తాజా వార్తలు

Published : 09/11/2020 01:57 IST

హంతకుడిని పట్టించిన అక్షర దోషాలు!

ఇంటర్నెట్‌డెస్క్‌: అక్షరజ్ఞానం లేకపోయినా నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. డబ్బు కోసం ఓ బాలుడిని కిడ్నాప్‌ చేశాడు. బాలుడిని వదిలేయాలంటే డబ్బు ఇవ్వాలంటూ ఆ బాలుడి తండ్రికి సందేశం పంపాడు. అందులోని అక్షర దోషమే చివరికి అతడిని పోలీసులకు పట్టించింది. తన నిరక్షరాస్యతే కటకటాల పాల్జేసింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసును ఛేదించడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హర్దోయ్‌కి చెందిన రామ్‌ప్రతాప్‌ సింగ్‌ ఎనిమిదేళ్ల బాలుడిని అక్టోబర్‌ 26న కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆ బాలుడిని హత్య చేశాడు. అయితే, బిడ్డను వదిలేయాలంటే రూ.2లక్షలు ఇవ్వాలని, పోలీసులకు ఈ విషయం చెప్పకూడదని బాలుడి తండ్రికి మెసేజ్‌ పెట్టాడు. అందులో సీతాపూర్‌ అనే పదం తప్పుగా రాశాడు. బాలుడి తండ్రి నవంబర్‌ 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

నిందితుడిని పట్టుకునేందుకు అతడు మెసేజ్‌ చేసిన నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. నంబర్‌ ఆధారంగా వ్యక్తి వివరాలు ఆరా తీస్తే అది దొంగిలించిన ఫోన్‌గా తేలింది. కేసు సంక్లిష్టంగా మారింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికో చిన్న పరీక్ష పెట్టారు. ‘నాకు పోలీస్‌ ఉద్యోగం కావాలి. అందుకోసం హర్దోయ్‌ నుంచి సీతాపూర్‌ వరకు పరిగెత్తగలను’ అనే మెసేజ్‌ హిందీలో రాయాలని చెప్పారు. ఈ క్రమంలో నిందితుడు సీతాపూర్‌ అనే పదాన్ని మరోసారి తప్పుగా రాశాడు. దీనికి తోడు పోలీస్‌ అనే పదాన్ని సైతం ‘పోలిష్‌’ అని తప్పుగా రాయడంతో రామ్‌ప్రతాప్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. బాలుడి తండ్రికి పంపిన సందేశం ఆధారంగా నిందితుడు పెద్దగా చదువుకోలేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అనుమానితులకు ఈ పరీక్ష పెట్టారు. నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని