అడవిలో బాలుడి ఏడుపు విని మృతదేహాల వద్దకు..

తాజా వార్తలు

Updated : 04/07/2021 04:29 IST

అడవిలో బాలుడి ఏడుపు విని మృతదేహాల వద్దకు..

నాగర్‌ కర్నూల్‌ : నల్లమల అటవీప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. అడవిలో ఇద్దరు  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి  గ్రామానికి చెందిన వివాహిత తన నాలుగేళ్ల కుమారుడితో సహా మరో యువకుడితో కలిసి వెళ్లపోయింది. పదర మండలం మద్దిమడుగు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఇవాళ సాయంత్రం వివాహిత, యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే మందు  తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడంతో వారు ఘటనాస్థలికి వెళ్లారు. పెద్దలు ఘటనా స్థలికి వెళ్లే వరకు నాలుగేళ్ల బాలుడు భిక్కు భిక్కుమంటూ తల్లి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్నాడు. బాలుడి ఏడుపు విని పెద్దలు మృతదేహాల వద్దకు చేరుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని