తుపాకితో వీరంగం సృష్టించిన యువకుడి అరెస్టు
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 12:51 IST

తుపాకితో వీరంగం సృష్టించిన యువకుడి అరెస్టు

చిత్తూరు: ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌లేద‌ని యువ‌తి ఇంటి ముందు తుపాకీతో కాల్పులు జ‌రిపి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసిన యువ‌కుడిని చిత్తూరు జిల్లా బైరెడ్డిప‌ల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపనత్తం గ్రామానికి చెందిన చాను అనే యువకుడు గురువారం ఉదయం పక్కింటి యువతిని ఫోన్‌ నంబరు అడిగాడు. ఆమె ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వెంటనే ఆమె తల్లి చాను ఇంటి వద్దకు వెళ్లి హెచ్చరించింది. యువకుడి ప్రవర్తన సరిగా లేదని గ్రామ పెద్దలకు తెలిపింది. దీంతో ఆగ్ర‌హించిన చాను గురువారం రాత్రి నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం చేశాడు. యువ‌తి త‌ల్లిదండ్రులు అడ్డుకునేందుకు రాగా కాల్పులు జ‌రిపాడు. ఈ క్ర‌మంలో ఓ తూటా పక్కింటి తలుపును పాక్షికంగా ధ్వంసం చేసింది. యువ‌తి తల్లి గ్రామ‌స్థుల స‌హ‌కారంతో నిందితుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని