close

తాజా వార్తలు

Published : 19/01/2021 08:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతమొందించి.. ఆపై నాటకం

ప్రియుడి కోసం భర్త హత్య

పంజాగుట్ట : వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సహకారంతో భర్తను కడతేర్చిందో భార్య. ఆపై సహజ మరణమంటూ నాటకమాడినా తప్పించుకోలేకపోయింది. పంజాగుట్ట పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి వివరాల ప్రకారం బిహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్య కుష్బుదేవీ(32), పదేళ్ల లోపున్న ఇద్దరు కుమారులతో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 

2019లో ఖైరతాబాద్‌లో జ్యూస్‌ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇందులో పనిచేసేందుకు లాల్‌ బాబు(35) అనే తన బంధువును నియమించాడు. ఈ క్రమంలో కుష్బుదేవికి లాల్‌బాబుకు సాన్నిహిత్యం పెరిగి వివాహేతర బంధానికి దారి తీసింది. ఆరు నెలల క్రితం అతడు తన భార్య మృతిచెందడంతో బిహార్‌ వెళ్లాడు. చాలాకాలం రాకపోవడంతో అతడ్ని జూస్‌ పాయింట్‌ నుంచి తొలగించాడు లక్ష్మణ్‌ జా. తర్వాత వచ్చిన లాల్‌బాబు హోటల్‌లో పనికి చేరాడు. కుష్బుదేవితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ వివాహేతర బంధాన్ని కొనసాగించసాగాడు. విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన కుష్బుదేవి అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిపించింది. భర్త ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించగా లాల్‌బాబు కదలకుండా చేతులను పట్టుకోవడంతో అతను మరణించాడు. మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదికలో మృతుని ఒంటిపై గాయాలు, బలంగా ఊపిరి ఆడకుండా చేసినట్టు తేలడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి...
దుర్గగుడిలో... టిక్కెట్ల దొంగను పట్టేశారు..!

తల్లీకొడుకుల గురించి తెలిస్తే చెప్పండి



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని