కుమార్తెను ప్రేమించాడని..ముక్కలుగా నరికాడు

తాజా వార్తలు

Updated : 28/05/2021 15:38 IST

కుమార్తెను ప్రేమించాడని..ముక్కలుగా నరికాడు

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ధనశేఖర్‌ (23) అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్‌ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి బాబు తమ కుమారుడిని నరికి చంపాడని ధనశేఖర్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బాలిక తండ్రి కాల్‌డేటాను పరిశీలించారు. శనివారం రాత్రి 10గంటలకు బాలిక తండ్రి నుంచి ధనశేఖర్‌కు ఫోన్ కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బాబును అరెస్ట్‌ చేసి విచారించగా.. శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్‌ ఉండటాన్ని చూశానని చెప్పారు. ధనశేఖర్‌ను కత్తితో నరికినట్లు బాలిక తండ్రి ఒప్పుకున్నాడు. గ్రామ శివారులోని బావిలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. సోమవారం బావిలో మృతదేహం తేలడాన్ని బాబు గమనించాడు. దీంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టాడు. నేరం ఒప్పుకోవడంతో బాలిక తండ్రిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని