close
Array ( ) 1

తాజా వార్తలు

వివాహ వేళ.. విషాద గాథ!

●ఇంటి రంగుల విషయంలో వివాదం

ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు


యోగేష్‌ (పాతచిత్రం)

పలమనేరు: బెంగళూరులో ఉద్యోగం.. మరో వారం రోజుల్లో పెళ్లికి నిశ్చయ తాంబూళం అందుకోనున్నాడు. ఎన్నో ఆశలతో సొంత గ్రామానికి వచ్చాడు. శుభకార్య పనుల్లో మునిగిపోయాడు. కానీ పినతల్లికి..తనకు మధ్య జరిగిన వివాదంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని టి.వడ్డూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాజీ ఎంపీపీ వేమన్నకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు 20 సంవత్సరాల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. అదే దిగులుతో అతని తల్లి చనిపోయింది. అనంతరం కొంత కాలానికి బంగారుపాళ్యం మండలం బోడిబండ్ల గ్రామానికి చెందిన కోకిలను వేమన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వేమన్న మొదటి భార్య రెండో కుమారుడు యోగేష్‌(29) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్లి చేయాలని తండ్రి నిశ్చయించాడు. మార్చి 1న నిశ్చయతాంబూళం పెట్టుకున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఇంటికి రంగులు వేయడం మొదలు పెట్టారు. ఈ నెల 20వ తేదీన ఇంటికి రంగులు వేస్తుంటే రంగుల విషయంలో యోగేష్‌కు, అతని పిన తల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో పిన తల్లి యోగేష్‌ను తిట్టడంతో అదేరోజు ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆచూకీ తెలియలేదు. ఇంట్లోని వారు ఫోన్‌ చేసినా సమాధానం లేదు. ఎక్కడో వెళ్లి ఉంటాడని భావించిన తండ్రికి ఆదివారం పెంగుగుంట పొలిమేరల్లోని అడవి సమీపంలో యోగేష్‌ మోటారు సైకిలు ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో అక్కడికి వెళ్లి చూస్తే.. మృతదేహం పడుంది. అక్కడే బీరు సీసాతో పాటు క్రిమిసంహారక గుళికలు ఉండటాన్ని గుర్తించారు. యోగేష్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. చెవిలో హెడ్‌సెట్‌తోనే ఉండటంతో ఆ సమయంలో ఎవరితోనో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎస్‌ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.