Guntur: కత్తితో దాడికి యత్నించిన యువకుడు
close

తాజా వార్తలు

Updated : 31/05/2021 16:32 IST

Guntur: కత్తితో దాడికి యత్నించిన యువకుడు

గుంటూరు: కత్తితో ఓ యువకుడు హల్‌చల్‌ చేస్తూ దాడికి యత్నించిన ఘటన గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో సోమవారం చోటు చేసుకుంది. అరండల్‌ పేట నాలుగో లైన్‌లో ఓ షాపు వద్దకు కత్తితో వచ్చిన యువకుడు తనని ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు. కాబోయే భర్తతో ఇంటి నుంచి వచ్చిన ఆమెపై దుర్భాలషలాడాడు. యువతికి కాబోయే భర్తపై కత్తితో దాడికి యత్నించాడు. అతను చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి యువకుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి అతను పరారయ్యాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం యువతి తనకు కాబోయే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికులు తీసిన వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని