బంజారాహిల్స్‌లో యువతి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 31/03/2021 01:17 IST

బంజారాహిల్స్‌లో యువతి ఆత్మహత్య

జూబ్లీహిల్స్‌: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఓ యువతి తనువు చాలించింది. సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఐశ్వర్య (19) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటోంది. ఈ క్రమంలో మరెడ్డి అషేర్ (20) అనే యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమ వివాహం వరకు వెళ్లింది.

గతంలో తమ పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న పెద్దలు.. వీరిని విడదీశారు. అయినప్పటికీ ఆ యువ జంట అప్పుడప్పుడూ కలుస్తుండేది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ప్రియుడు అషేర్‌ నమ్మిస్తూ వచ్చాడు. ఇలా కాలం వెళ్లదీస్తుండటంతో అషేర్‌ను ఐశ్వర్య నిలదీసింది. దీంతో అతడు ముఖం చాటేయడంతో సదరు యువతి తాను ఉంటున్న ఓ ప్రైవేటు వసతి గృహంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఐశ్వర్య కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని