Ap News: పుట్టినరోజే మృత్యు ఒడికి

తాజా వార్తలు

Published : 28/06/2021 01:13 IST

Ap News: పుట్టినరోజే మృత్యు ఒడికి

సముద్రంలో గల్లంతై నలుగురు యువకులు మృతి

కవిటి: స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా యువకులంతా సందడిగా చేశారు. అందరూ కలిసి భోజనాలు చేసి సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కాసేపు ఆడిపాడారు. కానీ వారి సంతోషం ఎంతో సేపు ఉండలేదు. సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు వారిలో నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని పుక్కళ్లపాలెం సముద్ర తీరంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిటి మండలం బొర్రపుట్టుగకు చెందిన సాయి లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో 18 మంది యువకులతో కలిసి వేడుక నిర్వహించారు. అక్కడే అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత 19 మంది యువకులు పుక్కళ్లపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. వారిలో ఐదుగురు సెల్ఫీలు తీసుకునేందుకు సముద్రంలోకి దిగారు. సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో అలల ఉద్ధృతి ఎక్కవ కావడంతో ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. సాయి లోకేశ్(20)‌, తిరుమల(17), మనోజ్‌కుమార్(21)‌, గోపీచంద్‌ నీటిలో గల్లంతవగా.. శ్రీరాం ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభించాయి. మరో యువకుడు గోపిచంద్‌ కోసం గాలిస్తున్నారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న కాశిబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, ఎస్సై అప్పారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో బొర్రపుట్టుగ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని