close

తాజా వార్తలు

Published : 17/04/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివేకా హత్య..కొనసాగుతోన్న సీబీఐ విచారణ

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఇవాళ వివేకా మాజీ కారు డ్రైవర్‌ దస్తగిరిని విచారించారు. మూడు రోజుల క్రితం దస్తగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. మరోవైపు పులివెందులలో ఉన్న దస్తగిరి తల్లిదండ్రులు హాజీవలి, మస్తానమ్మను సీబీఐ విచారించింది.

మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆసక్తికర విషయాలను బయటపెడుతూ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన రాసిన లేఖ సంచలనం రేపుతోంది. సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది గడిచినా కేసులో ఎలాంటి పురోగతి లేదని లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నానని.. ఈ కారణంగానే తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని అభిప్రాయపడ్డారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని