Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009570
            [news_title_telugu_html] => 

‘ఇడుక్కీ’ చిన్నారి తల్లిదండ్రులపై కేసు

[news_title_telugu] => ‘ఇడుక్కీ’ చిన్నారి తల్లిదండ్రులపై కేసు [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,3, ) )
‘ఇడుక్కీ’ చిన్నారి తల్లిదండ్రులపై కేసు - EENADU
close
‘ఇడుక్కీ’ చిన్నారి తల్లిదండ్రులపై కేసు

కేరళ: కదులుతున్న జీపులో నుంచి చిన్నారి కింద పడిపోయిన ఘటనకు సంబంధించి తల్లిదండ్రులపై కేసు నమోదైంది. సోమవారం ఇడుక్కీ జిల్లాలోని మున్నార్‌లో అటవీ ప్రాంతంలో చీకట్లో వెళుతున్న జీపులోంచి ఓ చిన్నారి తల్లి ఒడి నుంచి జారి పడిపోయింది. అటవీ శాఖ పుణ్యమా అని ఆ పాప సురక్షితంగా మళ్లీ తల్లి ఒడికి చేరింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఏడాదిన్నర చిన్నారిని ఒడిలో పెట్టుకుని అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారనే ప్రశ్నలూ వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు చిన్నారి తల్లిదండ్రులు సత్యభామ, సబీష్‌లపై కేసు పెట్టారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు బాలల చట్టంలోని సెక్షన్‌-75 కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు. కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘంలోనూ తల్లిదండ్రులపై కేసు నమోదైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.