close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘దొంగ’ నోట్లు... అన్నింటిపైనా ఒకే సంఖ్య

రూ.31 లక్షల నకిలీ కరెన్సీతో చిక్కిన ముఠా

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: అది జూన్‌ 29. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరిపల్లి సంతలో గొర్రెలకాపరి నుంచి  రూ.10 వేలకు ఇద్దరు వ్యక్తులు ఒక గొర్రెను కొన్నారు. తళతళలాడే నోట్లను చేతిలోపెట్టి వెంటనే ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు. వాటిని సంతోషంగా పరిశీలిస్తున్న అతనికి షాక్‌ తగిలినంత పనైంది. ఎందుకంటే ప్రతి నోటుపైనా ఒకే వరుస సంఖ్య ఉంది మరి. మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. వారు వెంబడించి నిందితులను పట్టుకుని విచారించగా అసలు ముఠా వెలుగులోకి వచ్చింది. వివరాలను విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి మంగళవారం వెల్లడించారు. డెంకాడ మండలం అక్కివరం వాసి కంది రాము ముఠాలో కీలకసూత్రధారి. అతను హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఇంజినీరింగ్‌చేసి విజయనగరంలో కంప్యూటర్‌ సెంటర్‌ పెట్టాడు. వ్యసనాలకు బానిసై దాన్ని మూసేశాడు. పలు నేరాలకు పాల్పడి, జైలుకూ వెళ్లాడు. బయటికొచ్చాక యూట్యూబ్‌లో దొంగనోట్లను ఎలా ముద్రించాలో చూశాడు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అయినాడకు చెందిన రైతు మజ్జి రమణ, ఇతని అల్లుడు టి.గౌరినాయుడు, విజయనగరానికి చెందిన కె.సురేష్‌, జిరాక్స్‌ సెంటర్లు నిర్వహిస్తున్న డెంకాడకు చెందిన  లెంక శేఖర్‌, ఎమ్మెస్సీ చదివి స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న పూల్‌బాగ్‌కాలనీ వాసి విజయ కిరణ్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. జిరాక్స్‌ మిషను, ఇతర సామగ్రి   తీసుకొని రాము ఇంట్లోనే రూ.31 లక్షల నకిలీ కరెన్సీ ముద్రించాడు. చలామణీ చేయడానికి రమణ, విజయకిరణ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. వారి నుంచి రూ.65,350 అసలు నోట్లు తీసుకొని నకిలీ నోట్లు వారికిచ్చాడు. చివరికి అంతా కలిసి పోలీసులకు చిక్కారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.