close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యుదాఘాతంతో నలుగురి దుర్మరణం

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఓ అపార్ట్‌మెంట్‌కు అలంకరణ చేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై నలుగురు దుర్మరణం చెందిన దుర్ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్‌ తాలూకా ఇండ్లబెలె వద్ద బుధవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన విద్యుత్తు మార్గం నుంచి కనెక్షన్‌ను తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించిందన్నారు. మృతులను ఆకాశ్‌ (30), మహదేవ (35), విషకంఠ (35), విజయ్‌సింగ్‌ (30)గా గుర్తించారు. వీరంతా స్థానికులే. అత్తిబెలె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన