కుమార్తెలపై కర్కశం

ప్రధానాంశాలు

Updated : 11/07/2021 12:33 IST

కుమార్తెలపై కర్కశం

మద్యం మత్తులో రోడ్డుకేసి కొట్టిన తండ్రి
రెండేళ్ల చిన్నారి మృతి.. మరో బాలికకు తీవ్ర గాయాలు

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అపురూపంగా చూసుకోవాల్సిన తండ్రే ఆ బాలిక పాలిట యముడయ్యాడు. రెండేళ్ల కుమార్తెను బలంగా రోడ్డుకు కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడుమామిడివలసలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండలం ఉలిపిరికి చెందిన కోలక ప్రసాద్‌, జోడుమామిడివలసకు చెందిన లక్ష్మి భార్యభర్తలు. వీరికి ఐదేళ్ల వయసున్న సిరి, రెండేళ్ల ప్రణవి ఉన్నారు. వలస కూలీలైన వీరు కరోనా కారణంగా కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం రాత్రి జోడుమామిడివలస వచ్చిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త.. కోపంతో పిల్లలిద్దర్నీ తీసుకొచ్చి ఇంటి ముందున్న సిమెంటు రోడ్డుకు బలంగా కొట్టాడు. చిన్న కుమార్తె ప్రణవి రోడ్డుపైనే మృతిచెందింది. తీవ్ర గాయాలైన పెద్ద కుమార్తెను విజయనగరం ఆసుపత్రికి తరలించారు. సీఐ అప్పలనాయుడు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన