close

ప్రధానాంశాలు

Published : 16/09/2020 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మందు పాతర గుర్తింపు.. పేల్చివేత

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించి పేల్చివేశాయి. సుకుమా జిల్లా కుంట పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముర్లిగుడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 5 కిలోల మందుపాతరను మంగళవారం పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై దాన్ని దూరం నుంచి పేల్చివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. సీఆర్పీఎఫ్‌ 217 బెటాలియన్‌ ఆధ్వర్యంలో రోజువారీగా జరిగే పెట్రోలింగ్‌లో భాగంగా ఈ మందుపాతరను గుర్తించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.