
ప్రధానాంశాలు
భార్యదే పన్నాగం
అన్నతో కలిసి భర్తను చంపేందుకు కుట్ర
మొత్తం ఏడుగురిపై కేసు
సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య వివరాలు వెల్లడించిన పోలీసులు
మల్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులో సోమవారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాచర్ల పవన్‌కుమార్‌ను హత్య చేసిన ఘటనలో అతని భార్య కృష్ణవేణి సైతం పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతన్ని పథకం ప్రకారమే సజీవ దహనం చేశారని వారు తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత పవన్‌కుమార్‌ను తన మరదలు సుమలత సజీవదహనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణవేణి కూడా అతడి హత్య ఘటనలో పాల్గొంది. సీఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణవేణి ఏడాది కిందట ఆదిలాబాద్‌లోని బంధువుల పెళ్లికి వెళ్లగా.. ఆమెకు చెందిన ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అప్పటి నుంచి భార్యతో పవన్‌కుమార్ తరచూ గొడవపడేవాడు. వాటిని తన బావమరిది జగన్ తస్కరించాడన్న అనుమానంతో అతన్ని దూషిస్తూ.. చంపుతానని బెదిరించేవాడు. జగన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. పవన్‌కుమార్ చేతబడి చేయించడం వల్లే జగన్ చనిపోయాడని బల్వంతాపూర్ శివారులో మంజునాథ ఆలయం, ఆశ్రమం నిర్వహిస్తున్న కృష్ణవేణి అన్న విజయ్‌స్వామి తన కుటుంబ సభ్యులకు నూరిపోశాడు. దీంతో అతన్ని అంతమొందించడానికి కృష్ణవేణి, విజయ్స్వామిలతో పాటు ఆమె మరదలు సుమలత, అక్క స్వరూప, అమ్మ ప్రమీల పథకం రూపొందించారు. జగన్ ద్వాదశదిన కర్మ సందర్భంగా సోమవారం మంజునాథ ఆలయం పక్కన గల ఓ గదిలో జగన్ చిత్రపటానికి పవన్‌కుమార్ శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో తలుపులు మూసి, బయట నుంచి తాళం వేశారు. ఆ తర్వాత కృష్ణవేణితో పాటు సమీప బంధువులు, కొండగట్టుకు చెందిన నిరంజన్‌రెడ్డి అనే యువకుడు కలిసి గది కిటికీ, జాలీలలో నుంచి పెట్రోలు పోసి నిప్పంటించారని సీఐ వెల్లడించారు. పవన్‌కుమార్ తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కృష్ణవేణితో పాటు అయిదుగురు కుటుంబ సభ్యులు, కొండగట్టుకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
