close

ప్రధానాంశాలు

Published : 26/11/2020 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు దారుణ హత్య

పొలంలోనే నరికి చంపిన దుండగులు

కోలమాన్‌పేట(కోసిగి), న్యూస్‌టుడే: పొలానికి వెళ్లిన ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు మండలంలోని కోలమాన్‌పేట గ్రామానికి చెందిన బోయ కిందింటి గోవిందు(55) పొలంలో దారుణ హత్యకు గురయ్యారు. పొలంలో పత్తి కోతలకు గోవిందు, తన భార్య తిక్కమ్మ, కుమార్తెతో కలిసి వెళ్లారు. సాయంత్రం కాగానే తాను వస్తాను... మీరు ఇంటికి వెళ్లండంటూ భార్య, కుమార్తెకు గోవిందు చెప్పారు. ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో పెద్దకుమారుడు వెంకటేశ్‌ పొలానికి వెళ్లి చూడగా తండ్రి గోవిందు రక్త గాయాలతో విగత జీవిలా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు వివరాలు తెలుపగా ఎస్సై ధనుంజయ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్యకు గల కారణాలను ఎస్సై ఆరా తీశారు.
గురువారం కర్నూలు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి విచారిస్తామని తెలిపారు. మృతుడు గోవిందు భార్య వైకాపాలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పాత కక్షలతోనే తన భర్తను హత్య చేసి ఉంటారని ఆమె తెలిపారు. వైకాపా మండల బాధ్యుడు మురళీరెడ్డి, నాయకులు మహంతేష్‌స్వామి, జగదీష్‌స్వామి, మంగమ్మ, మాణిక్‌రాజు, వెంకటేశులు, నాగరాజు మృతుడి కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. గోవిందుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. హత్య జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన