close

ప్రధానాంశాలు

Published : 14/01/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేవుళ్లపై వ్యాఖ్యలు చేసిన కాకినాడ యువకుడి అరెస్టు

ఈనాడు, అమరావతి: హిందూ దేవుళ్లను కించపరిచేలా, భిన్నవర్గాలమధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కాకినాడకు చెందిన సోడదశి ప్రవీణ్‌ చక్రవర్తిని (33) సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సింగ వెంకటశ్రీలక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేశారు. ప్రవీణ్‌పై తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులున్నాయని, సీఐడీ పరిధిలోని సైబర్‌ నేరాల విభాగం పోలీస్‌ స్టేషన్‌లో సైబర్‌ బుల్లిషీట్‌ కూడా ఉందని సీఐడీ పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐడీ విబాగాధిపతి పీవీ సునీల్‌ కుమార్‌ హెచ్చరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన