close

ప్రధానాంశాలు

Published : 14/01/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొలంలో నీరు తాగి ఆరు నెమళ్లు మృతి!

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన కనకాల లక్ష్మయ్య పంటపొలంలో నీరు తాగి ఆరు నెమళ్లు మృతిచెందిన సంఘటన బుధవారం  జరిగింది. గమనించిన ఆయన వెంటనే ప్రజాప్రతినిధుల ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పురుగుమందు పిచికారి చేసిన పొలంలోని నీటిని తాగి మయూరాలు మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పంచనామా అనంతరం నెమళ్లను దహనం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన