
ప్రధానాంశాలు
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా చిక్పాల్-మర్జూమ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టుల కదలికలను నియంత్రించడంలో భాగంగా సీఏఎఫ్(ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్), డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు) బలగాలు ఉదయం 6 గంటల సమయంలో చిక్పాల్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుగా తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వీరిద్దరి మధ్య కొద్దిసేపు ఎదురు కాల్పులు జరగడంతో కట్టేకల్యాణ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు నేత హిడ్మా ముచాకీ భద్రతా బలగాల తుపాకీ తూటాలకు తీవ్ర గాయాలై మృతి చెందారు. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతాల నుంచి తప్పించుకొని పారిపోయారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
