
ప్రధానాంశాలు
బోగస్ సంస్థలతో రూ.14 కోట్లకు టోకరా
ఇద్దరిని అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ జీఎస్టీ అధికారులు
ఈనాడు, హైదరాబాద్: బోగస్ సంస్థలు, నకిలీ ఇన్వాయిస్లతో అక్రమంగా 14.2 కోట్ల ఇన్పుట్ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ని తీసుకోవడంతో పాటు రూ.3.15 కోట్ల జీఎస్టీ ఎగవేత వ్యవహారాన్ని సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఛేదించారు. బోగస్ సంస్థలను ఏర్పాటు చేసినవారిని గుర్తించి అరెస్టు చేసినట్లు సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుత్బుద్దీన్ జునాగఢ్ వాలా, అలీసాగర్ జునాగఢ్వాలా అనే ఇద్దరు వ్యక్తులు బోగస్ సంస్థల పేరుతో సరకులు సరఫరా చేసి నకిలీ ఇన్వాయిస్లను వివిధ సంస్థలకు అందజేసినట్లు తెలిపారు. నేషనల్ హార్డ్‌వేర్ ట్రేడింగ్ కంపెనీతో పాటు మరో మూడు కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లు, వే బిల్లులతో రూ.14.2 కోట్ల ఐటీసీని అక్రమంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదే వ్యవహారంలో ఫ్రంట్‌లైన్ ఎంటర్ప్రైజెస్, యూనివర్సల్ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.3.15 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ అక్రమ వ్యవహారంలో కీలకమైన కుత్బుద్దీన్ జునాగఢ్ వాలా, అలీసాగర్ జునాగఢ్ వాలాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
