
ప్రధానాంశాలు
మూగ బాలికపై సామూహిక అత్యాచారం
ఆనవాళ్లు దొరక్కూడదని కళ్లనూ పొడిచిన మృగాళ్లు
మధుబని: తోటి పిల్లలతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లిన ఆ చిన్నారి (15)పై ముగ్గురు మృగాళ్లు కనికరం లేకుండా దాడి చేశారు. చెవిటి, మూగ అయిన ఆ బాలికను అంధురాలిగా కూడా మార్చేస్తే.. తమ పైశాచికత్వానికి ఇక సాక్ష్యాధారాలు ఉండవని రాక్షసంగా ప్రవర్తించారు. బిహార్ రాష్ట్రం మధుబని జిల్లా హర్లాఖి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కవాహ బర్హి గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు ఓ పదునైన వస్తువుతో ఆమె కళ్లను తీవ్రంగా గాయపరిచారు. ఆమె కంటిచూపును కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. బాలికతో ఉన్న పిల్లల్లో ఒకరు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. వారు పరుగున వచ్చేసరికి అక్కడే బీడు భూమిలో ఆమె స్పృహ లేకుండా పడుంది. ఒకే గ్రామానికి చెందిన నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మధుబని ఆసుపత్రికి తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు.
డ్యాంలో వైద్య విద్యార్థిని మృతదేహం
రామ్‌గఢ్: ఝార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాలోని పత్రాతు డ్యాంలో కాళ్లూచేతులు కట్టేసి ఉన్న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు బుధవారం కనుగొన్నారు. గొడ్డా జిల్లాకు చెందిన ఈమె హజారీబాగ్ వైద్య కళాశాల విద్యార్థినిగా గుర్తించారు. మంగళవారం డ్యాం నీటిపై తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది.
కానిస్టేబుల్‌పై అత్యాచార ఆరోపణ
గోండా (యూపీ): సహోద్యోగి అయిన పోలీస్ కానిస్టేబుల్ తనపై అత్యాచారం జరిపి, బెదిరించినట్టుగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో స్థానిక మహిళా పోలీస్‌స్టేషనులో కేసు నమోదైంది. ఎస్పీ శైలేష్‌కుమార్ పాండే మాట్లాడుతూ.. ఆమెను వైద్యపరీక్షలకు పంపినట్లు తెలిపారు.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్ఈసీ చర్యలు
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
