
ప్రధానాంశాలు
అసహజ బంధం.. విషాదాంతం
ప్రేమించిన సహచరి దూరమైందనే బాధతో మరో యువతి బలవన్మరణం
శంకర్పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వారిద్దరూ ఒకే తరగతికి చెందిన అమ్మాయిలు... కలిసి రెండేళ్లు చదువుకున్నారు. మనసులు కలిసి జీవితాంతం బతకాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరి బంధానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో శుక్రవారం ఓ యువతి(19) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. శంకర్పల్లి ఎస్సై లక్ష్మినారాయణ, బంధువుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఓ యువతి(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇంటర్ హాస్టల్లో ఉండి చదువుకుంది. అదే కళాశాలలో చదువుతున్న ఖమ్మం జిల్లా మణుగూరుకి చెందిన మరో యువతి(24)తో స్నేహం కాస్తా ప్రేమగా మారింది. జీవితాంతం కలిసుండాలని భావించిన వీరిద్దరూ గతేడాది జనవరిలో ఇంట్లో నుంచి పారిపోయి వికారాబాద్‌లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలపాటు అద్దె గదిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వీరి జాడను గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఎవరింటికి వారిని పంపించారు. అప్పట్నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు గుర్తించి వద్దని వారించారు. ఇదే విషయంపై వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రధానాంశాలు
సినిమా
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- యువతిపై 60 మంది అత్యాచారం!
- నేనున్నానని..
- ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచి’
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- చెల్లి పెళ్లికి అధిక కట్నం ఇస్తున్నారని అక్కసు!
- రివ్యూ: పవర్ ప్లే
- ఎన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు..
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
