
ప్రధానాంశాలు
ముసుగేసుకొచ్చి.. తుపాకీతో బెదిరించి..
రూ.7 కోట్ల బంగారు నగలు, నగదు దోపిడీ
హోసూరు, న్యూస్‌టుడే: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు కార్పొరేషన్ పరిధిలో జనం రద్దీగా ఉండే బాగలూరు రహదారిలో నిర్వహిస్తున్న కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులో రూ.7 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదును పట్ట పగలు దొంగలు దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం ముసుగు వేసుకున్న ఆరుగురు దొంగలు వచ్చి సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి ఫైనాన్స్ ఆఫీసు లోపలికి ప్రవేశించి మూడు వేల సవర్ల బంగారు నగలను, రూ.95 వేల నగదును మూటగట్టి దోచుకెళ్లారు. విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫైనాన్స్ ఉద్యోగులను ప్రత్యేకంగా విచారించారు. దొంగలను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు జిల్లా ఎస్పీ గంగాధర తెలిపారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- ఆర్ఆర్ఆర్కు మార్గం సుగమం
- వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్
- సన్నబడతారంటూ స్కీం... రూ.1,500 కోట్ల స్కాం
- బన్ని జంటకు పదేళ్లు.. సమంత సవాల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
