
ప్రధానాంశాలు
వెండిసింహాల చోరీ.. పాత నేరస్థుడి పనే
నిందితుడి నుంచి వెండి దిమ్మెలు స్వాధీనం
ఈనాడు డిజిటల్, విజయవాడ: కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. పాత నేరస్థుడే ఈ పని చేశాడని నిర్ధారించారు. చెత్త ఏరుకునేవాడిలా ఆలయంలో తిరిగి చోరీకి పాల్పడిన సాయిబాబాతో పాటు.. బంగారం వ్యాపారి కమలేష్‌ను అరెస్టు చేశారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం విలేకర్లకు సీపీ శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన జక్కంపూడి సాయిబాబా ఈ చోరీ కోసం జూన్‌లో రెక్కీ నిర్వహించాడు. జులైలో వచ్చి చోరీకి పాల్పడ్డాడు. తణుకు శివార్లలో వెండి సింహాలను గుర్తుపట్టని విధంగా చితక్కొట్టి వాటిని తణుకులోని సురేంద్ర జ్యువెలరీ షాపు యజమాని కమలేష్‌కు రూ.35వేలకు విక్రయించాడు. గతేడాది సెప్టెంబరు 17న వెండి సింహాల చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పాత నేరస్థుల కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 3 వెండి సింహాల ప్రతిమలకు సంబంధించి 9 కిలోల వెండి దిమ్మెలు, మిగతా ఆలయాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి 6.4 కేజీల వెండి దిమ్మెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- యువతిపై 60 మంది అత్యాచారం!
- నేనున్నానని..
- ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచి’
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- చెల్లి పెళ్లికి అధిక కట్నం ఇస్తున్నారని అక్కసు!
- రివ్యూ: పవర్ ప్లే
- ఎన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు..
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
