
ప్రధానాంశాలు
16 మంది మహిళలను చంపిన సైకో!
నర హంతకుడిని పట్టించిన చిన్న చీటీ
రాచకొండ పోలీసుల అదుపులో నిందితుడు?
ఈనాడు, హైదరాబాద్: చిన్న చీటీ.. ఏకంగా పదహారు మంది మహిళలను దారుణంగా కడతేర్చిన కరుడుగట్టిన హంతకుడిని పోలీసులకు పట్టించింది. డబ్బు కోసమో.. మరే కారణమో తెలియదుగానీ ఒంటరిగా కనిపించిన ఆడవాళ్లను మాటలతో ఏమార్చి శివార్లకు తీసుకువెళ్లి ఒళ్లు గగుర్పొడిచేలా హతమార్చిన సైకో వ్యవహారం చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఈనెల మొదటివారంలో నగర శివారుల్లోని అంకుషాపూర్ దగ్గర సగం కాలిన మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించినా మృతురాలికి సంబంధించిన సమాచారం దొరకలేదు. దారుణంగా హతమార్చి గుర్తుపట్టకుండా మొహం మీద పెట్రోలు పోసి తగలబెట్టేయడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే ఆమె చీరకొంగుకు ఓ ముడి కనిపించింది. విప్పి చూస్తే అందులో చిన్న చీటీ.. అందులో ఒక ఫోన్ నంబర్ రాసి ఉంది. హమ్మయ్య అనుకున్న పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టగా అది నేరేడ్మెట్కు చెందిన వ్యక్తిదిగా తేలింది. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. కాకపోతే.. ఆమె పేరు వెంకటమ్మ (50) అని, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటుందని తెలిపాడు.
చంపింది ఎవరు..?
రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. జనవరి 1న వెంకటమ్మ అదృశ్యమైనట్లు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఆరోజు మధ్యాహ్నం బేగంపేటలో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఒకచోట ఆమె, మరో వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఫోటోను మృతురాలి కుటుంబ సభ్యులకు చూపించారు. అతన్ని ఎప్పుడూ చూడలేదని వారు స్పష్టం చేశారు. మల్కాజిగిరికి చెందిన వ్యక్తి కూడా అతడెవరో తనకు తెలియదని చెప్పాడు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది.
గుర్తుపట్టిన చేపల వ్యాపారి..
ఆ వ్యక్తి ఫొటోను పట్టుకుని రాచకొండ పోలీసులు నగరమంతా గాలించారు. చివరకు ఓ చేపల వ్యాపారి అతడిని గుర్తు పట్టాడు. బోరబండలో చూసినట్లు చెప్పాడు. రాచకొండ పోలీసులు అక్కడ జల్లెడ పట్టారు. ఎట్టకేలకు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కైనట్లు సమాచారం. వెంకటమ్మ ఒక్కరినే కాకుండా.. కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, ఇతరత్రా ప్రదేశాల్లో ఒంటరిగా కనిపించిన చాలామంది మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిసింది. పోలీసులు క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించుకుని.. 16 మందిని హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. విచారణ పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా భావిస్తున్నారు. డబ్బు కోసం చంపాడా లేక మరేదైనా కారణమా అనేదానిపై విచారిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ కేసుల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ప్రధానాంశాలు
సినిమా
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- అమెరికాలో చిత్తూరుకు చెందిన టెకీ ఆత్మహత్య
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నేడు ఎస్బీఐ మెగా వేలం..!
- సిరాజ్‌పై స్టోక్స్ స్లెడ్జింగ్: రంగంలోకి కోహ్లీ!
- ‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
- బగ్ గుర్తించి.. ₹36 లక్షలు సాధించి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
