close

ప్రధానాంశాలు

Published : 27/01/2021 06:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుమార్తెల హత్య కేసులో తల్లిదండ్రుల అరెస్టు

మదనపల్లె (నేరవార్తలు), న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్లు అలేఖ్య (27), సాయిదివ్యల (22) హత్య కేసులో నిందితులైన తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం శివనగర్‌ కాలనీకి చెందిన అలేఖ్య, సాయిదివ్య ఈనెల 24న తమ ఇంట్లోనే తల్లిదండ్రుల చేతుల్లో హత్యకు గురైన విషయం విదితమే. తల్లిదండ్రులే నిందితులన్న ప్రాథమిక నిర్ధారణతో వారిని అరెస్టు చేసి ఇంటి నుంచి స్టేషన్‌కు తరలిస్తుండగా తల్లి పద్మజ.. అవంతికా ఆలయానికి వెళ్లొస్తానంటూ కేకలు వేసింది. స్టేషన్‌లో విచారించిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా పరీక్ష చేసే సమయంలోనూ తనకు ఏ పరీక్షలూ వద్దని తానే శివుడినని.. ప్రపంచంలో చెత్తను తొలగించేందుకు కరోనాను పంపానంటూ అరిచింది. వైద్యులు వారికి పరీక్షలు చేసి మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లు పోలీసుల దృష్టికి తెచ్చారు. మదనపల్లెలోని రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ న్యాయమూర్తి ఎదుట నిందితులను హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించారు. పోలీసు బందోబస్తు మధ్య వారిని సబ్‌ జైలుకు తరలించారు. డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మేం అడిగిన అన్ని ప్రశ్నలకూ వారు సమాధానం ఇస్తున్నారు. ప్రతి జవాబుకూ ఆధ్యాత్మిక, తాంత్రిక విషయాలు జోడిస్తున్నారు తప్ప ఎలాంటి మానసిక సంఘర్షణకు గురి కాలేదు. సీసీ కెమెరా ఫుటేజీ, పోస్టుమార్టం నివేదిక, క్లూస్‌టీం ఆధారాలతో విచారణ జరుపుతాం’ అని చెప్పారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన