close

ప్రధానాంశాలు

Published : 23/02/2021 04:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని 11ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడుకు చెందిన ఓలం సుబ్బయ్య అలియాస్‌ అంగడి సుబ్బయ్యకు 20 ఏళ్ల జైలుశిక్ష రూ.1,000 జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి బి.శ్యాంసుందర్‌ సోమవారం తీర్పు చెప్పారు. 2018 ఏప్రిల్‌ 25న ఓ చిన్నారి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా దుకాణం నిర్వహిస్తున్న ఓలం సుబ్బయ్య చాక్లెట్‌ ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పటి ఆళ్లగడ్డ డీఎస్పీ కె.చక్రవర్తి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు నేరాన్ని అంగీకరించటంతో అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.4.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తీర్పు కాపీ అందిన 30 రోజుల్లో బాధితురాలికి పరిహారం అందజేయాలని, మైనార్టీ తీరేంత వరకు బ్యాంకులోనే నగదు ఉంచాలని పేర్కొన్నారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన