
ప్రధానాంశాలు
ఓటు వేయలేదని దాడి
బాధితుడి పరిస్థితి విషమం
వత్సవాయి, న్యూస్‌టుడే: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని తమపై వైకాపా కార్యకర్తలు దాడిచేశారని కృష్ణాజిల్లా వత్సవాయి మండలం తాళ్లూరుకు చెందిన పెద్ది తిరపతయ్య ఆరోపించారు. సుమారు 20 మంది ఇనుప రాడ్లు, సుబాబుల్ కర్రలతో దాడిచేయడంతో ఆయన తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డు వచ్చిన అతని కుమారుడు ఉపేంద్ర, కుమార్తె ధనలక్ష్మిలను కూడా గాయపరిచారు. తిరపతయ్యను వెంటనే ఖమ్మం జిల్లా మధిరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య బాధితులను పరామర్శించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని, బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని ఎస్సై సోమేశ్వరరావు చెప్పారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తిరపతయ్య, అతని కుటుంబసభ్యులపై దాడి చేయడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రధానాంశాలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
