close

ప్రధానాంశాలు

Updated : 28/02/2021 05:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సచివాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

దుత్తలూరు ఎమ్మార్వో  మోసం చేశారని ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో తమను మోసం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర సచివాలయం ముందు దంపతులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన నాగార్జున, భవాని దంపతులు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు శనివారం పెట్రోలు డబ్బాతో సచివాలయానికి వచ్చారు. పోలీసులు వారిని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘మా స్నేహితులు, బంధువులకు చెందిన 300 ఎకరాలను ఆన్‌లైన్‌ చేయిస్తానని ఎమ్మార్వో చంద్రశేఖర్‌ 2015లో రూ.1.50 కోట్లు తీసుకున్నారు. కారు, బంగారం కొనేందుకు ఆయనకు డబ్బిచ్చాం. సగం పొలం ఆన్‌లైన్‌ చేయించారు. మిగతా భూమికి సంబంధించి డబ్బులు అడిగితే నన్ను చంపేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ గూడూరు సబ్‌ కలెక్టర్‌కు అందించాం. అప్పుల ఒత్తిడి భరించలేక గతేడాది నెల్లూరు కలెక్టరేట్‌ ముందు ఆత్మహత్యకు యత్నించా. కలెక్టర్‌ హామీ ఇచ్చినా ఇంతవరకూ న్యాయం జరగలేదు. సీఎం జగన్‌ను కలిస్తే న్యాయం చేస్తారనే నమ్మకంతో ఇక్కడికొచ్చా’’ అని వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన