close

ప్రధానాంశాలు

Published : 28/02/2021 05:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చక్రాల మధ్య నలిగిన ప్రాణం

తల్లడిల్లిన తల్లి హృదయం

నాగోలు, న్యూస్‌టుడే: కొన్ని దృశ్యాలు గుండెను ద్రవింపజేస్తాయి. ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో లారీ చక్రాల మధ్య ఇరుక్కుపోయాడు. బయటికి రావడానికి గింజుకుంటున్నాడు.రక్షించండంటూ ఆక్రందనలు చేస్తున్నాడు. అక్కడికి చేరిన వారి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. గంటపాటు ఇలా నరకయాతన అనుభవించాడు. ఇంతలో ఆ యువకుని తల్లి అక్కడికి చేరుకుంది. ఒక్కగానొక్క బిడ్డ పడుతున్న వేదన చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కాపాడండంటూ గుండెలవిలసేలా రోదించింది. ఎట్టకేలకు పోలీసులు జాకీలు పెట్టి లారీని కొంత పైకిలేపి, యువకుడిని బయటికి లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడు తర్వాత కొత్తపేటలోని ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఆ తల్లికి తీరని గుండె కోతే మిగిలింది. హైదరాబాద్‌ లింగోజిగూడకు చెందిన రాజేశ్వర్‌ (27) జీవితం ఇలా విషాదాంతమైంది. ఆయన శనివారం ఉదయం మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా సాగర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో రెడీమిక్స్‌ లారీ ఢీకొట్టింది. బండిని ఈడ్చుకుపోవడంతో లారీ కింద ఇరుక్కుపోయి అసువులు బాశాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ యాదయ్యను అరెస్టు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన